టీవీకే అధినేత విజయ్ను ప్రశంసిస్తూ సెలబ్రిటీలు పోస్ట్లు పెడుతున్నారు. ప్రజలు ఎవరిని కోరుకుంటారో విజయం వారినే వరిస్తుందని మరోసారి రుజువైందని వరలక్ష్మి శరత్ కుమార్ పోస్ట్ పెట్టారు. ‘ఇది చారిత్రాత్మక విజయం. గతంలో ఇలాంటి గెలుపు లేదు.. భవిషత్తులో రాదు’ అని జీవి ప్రకాశ్ పేర్కొన్నాడు. ‘మీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది’ అని టైగర్ ష్రాఫ్ ట్వీట్ చేశాడు.