మలయాళ చిత్ర పరిశ్రమ విజయ రహస్యాన్ని నటుడు ఫహాద్ ఫాజిల్ తనకు వివరించారని నిర్మాత రవిశంకర్ తెలిపారు. ‘కేవలం రూ.20 కోట్ల బడ్జెట్తోనే బాహుబలి స్థాయి వసూళ్లు సాధించే సినిమాలను ఎలా నిర్మించాలనే దానిపైనే మాలీవుడ్ ఎక్కువగా దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారీ ఖర్చు కంటే బలమైన కథనే నమ్ముకుని అద్భుతాలు సృష్టించడం మా ప్రత్యేకత’ అని ఫహద్ చెప్పినట్టు రవిశంకర్ వెల్లడించారు.