అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తల్లిదండ్రులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినప్పటికీ అక్కడ జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇచ్చేలా అమెరికన్ చట్టాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ్టి నుంచి అలాంటి జన్మహక్కును ఫెడరల్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదని ట్రంప్ ప్రకటించారు. అక్రమంగా ప్రవేశించిన ఏలియన్స్ ఏరివేత కోసం పరిశీలన, స్క్రీనింగ్ చేపడతామని తెలిపారు.