నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ OTTలో అదరగొడుతోంది. నెట్ఫ్లిక్స్లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న సినిమాల్లో ఇది టాప్లో నిలిచింది. అలాగే బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్ తదితర దేశాల్లో టాప్ 2లో ట్రెండ్ అవుతోంది. ఇక బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై రూ.170 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.