బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’కు జపాన్ మూవీ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ రూపంలో భారీ ముప్పు పొంచి ఉంది. రెండు సినిమాలు ఐమ్యాక్స్ వెర్షన్లో 2026 నవంబరులో వస్తుండటంతో స్క్రీన్స్ కేటాయింపులో క్లాష్ రానుంది. ఆస్కార్ విన్నింగ్ సీక్వెల్ కావడంతో విదేశాల్లో గాడ్జిల్లాకు క్రేజ్ ఎక్కువ. దీంతో రూ.4000 కోట్ల బడ్జెట్ ‘రామాయణ’ ఓవర్సీస్ కలెక్షన్లపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.