కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కొత్త లోక’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. వెంటనే చిత్రం నుంచి ఆ డైలాగ్స్ తొలగించనున్నట్లు ప్రకటించాడు.