తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమా ఈనెల 12న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ‘మిరాయ్’ ట్రైలర్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసినట్లు మనోజ్ తెలిపాడు. ట్రైలర్ అద్భుతంగా ఉందని రజనీ ప్రశంసించినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు రజనీకాంత్‌కు కృతజ్ఞతలు చెబుతూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.