హీరో రామ్ పోతినేని వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు పొందడంలేదు. దీంతో రామ్ తన కోసం ఒక విభిన్నమైన కథను స్వయంగా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని తన సొంత ప్రొడక్షన్ హౌస్లో, తానే దర్శకుడిగా మారి తెరకెక్కించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అని, ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో రామ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడని సమాచారం.