బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్రలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రాబోతున్న స్పై థ్రిల్లర్ ‘ఫ్యామిలీమ్యాన్ 3’. తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా టీం వేడుకను నిర్వహించింది. ఈ సిరీస్లో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక బృందం పాల్గొని సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.