నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ చనిపోయారు. ఆమెకు సంతాపం తెలుపుతూ మెగాసార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘మా అత్తయ్య.. దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఓం శాంతిః’ అని పేర్కొన్నారు.