మొదటి ఎన్నికల్లోనే విజయ్ అద్భుతమైన విజయం సాధించారని కోలీవుడ్ హీరో విశాల్ ప్రశంసించాడు. యావత్ తమిళనాడులో MGR నాటి కాలం పునరావృతమైందని అన్నాడు. ‘ప్రజలు మార్పు కోరుకుంటే ఎవ్వరూ ఆపలేరు. నేటి రాజకీయ పరిస్థితులే అందుకు నిదర్శనం. ఎన్నికల్లో టీవీకే విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. రాష్ట్రాభివృద్ధితో పాటు, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నాడు.