‘ప్రియురాలు పిలిచింది’ సినిమాలో మమ్ముట్టి యుద్ధంలో కాలు పోగొట్టుకున్న మేజర్ బాలా పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను చాలామంది స్టార్స్ రిజెక్ట్ చేసినట్లు దర్శకుడు రాజీవ్ మీనన్ తెలిపారు. ఆ పాత్ర గొప్పతనమంతా ఆయన నడకలోనే ఉంటుందన్నారు. అయితే ఒక కాలు ఉన్న పాత్రలో నటించడం తమకు ఇష్టం లేదని స్టార్స్ ముఖం మీదే చెప్పారని, కానీ మమ్ముట్టి మాత్రం వెంటనే ఓకే చెప్పారని పేర్కొన్నారు.