ప్రభాస్(prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ మాస్ ప్రాజెక్ట్ 'సలార్' పై భారీ అంచనాలున్నాయి. కానీ సలార్‌కు పోటీగా షారుఖ్ 'డుంకీ' రిలీజ్ అవుతోంది. ఇక ఇప్పుడు మరో రెండు రోజులు వెనక్కి వెళ్లి.. మరో సినిమా పోటీకి వచ్చేసింది.
అప్పుడప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ మూవీస్‌ని భయపెడుతుంటాయి. అవతార్ లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు.. ఒక్క టాలీవుడ్‌నే కాదు, ఇండియాలో మరో సినిమా రిలీజ్‌కు సాహసం చేయలేదు. ఇక ఇప్పుడు మరో ఇంగ్లీష్ మూవీ ప్రభాస్(prabhas), షారుఖ్ ఖాన్‌లను భయపెడుతోంది. అసలే ప్రభాస్, షారుఖ్ మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో జరగబోతోంది. డిసెంబర్లో ఒక్క రోజు గ్యాప్‌తో ఈ సినిమాలు క్లాష్‌కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల పై భారీ అంచనాలున్నాయి. కానీ హాలీవుడ్ నుంచి డిసెంబర్ 22న ‘ఆక్వామెన్ లాస్ట్ కింగ్ డమ్’ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. ముందుగా 20న డేట్ లాక్ చేసుకున్న ఆక్వామెన్(aquaman).. ఇప్పుడు 22కి షిఫ్ట్ అయ్యింది. దీంతో సలార్ సినిమాకు గట్టి పోటీ తప్పేలా లేదు.
అయితే.. ఇండియాలో ఆక్వామేన్ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోయినా..ఓవర్సీస్లో మాత్రం థియేటర్ల కొరత ఖచ్చితంగా ఉంటుంది. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ ప్రియార్టీ కూడా ఇంగ్లీష్ సినిమాలకే ఉంటుంది. కాబట్టి ప్రీమియం స్క్రీన్లన్నీ ఆక్వామేన్ కబ్జా చేసేస్తుంది. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా సలార్ సినిమాపై పడే ఛాన్స్ ఉంది. కాబట్టి.. సలార్(Salaar), డుంకీ(dunki) మేకర్స్ ఈ విషయంలో కాస్తా సీరియస్‌గా ఉంటే ఓవర్సీస్లో భారీ వసూళ్లు అందుకోవచ్చు. లేదంటే.. ఆక్వామెన్ దెబ్బను తట్టుకోవడం కష్టమే అంటున్నారు. జాసన్ మోమోవా హీరోగా జేమ్స్ వాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆక్వామెన్’ 2018లో బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్’ వస్తోంది. మరి ఈ బిగ్గెస్ట్ క్లాష్ ఎలా ఉంటుందో చూడాలి.