ఒకే ఒక్క టీజర్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ‘ఆదిపురుష్’ అంచనాలు తలకిందులయ్యాయిని కొందరు.. రామాయణాన్ని వక్రీకరిస్తున్నారని ఇంకొందరు.. యానిమేషన్ మూవీకి 500 కోట్లా.. అని మరికొంతమంది.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అయినా యూట్యూబ్‌లో దుమ్ముదులిపేసింది ఆదిపురుష్. ఇక అంతకు మించి అనేలా టీజర్‌ను త్రీడిలో ప్రదర్శిస్తూ..
అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తోంది చిత్ర యూనిట్. సినీ ప్రముఖులతో పాటు అభిమానుల కోసం ఆదిపురుష్ త్రీడీ టీజర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ ఏఎంబి సినిమాస్‌లో వేసిన స్పెషల్ 3డి స్క్రీనింగ్ షో సందర్భంగా చెప్పుకొచ్చాడు ప్రభాస్. తాను త్రీడిలో ఆదిపురుష్ టీజర్ టైం చూసినప్పుడు.. ఓ పిల్లాడిలా ఫీల్ అయ్యానన్నారు. అలాగే ఫ్యాన్స్ కోసం 60 థియేటర్లలో ‘ఆదిపురుష్’ టీజర్‌ను త్రీడీలో ప్రదర్శిస్తున్నామన్నారు. ఎందుకంటే.. వాళ్ళే మాకు సపోర్ట్.. ఫస్ట్ ఫ్యాన్స్ చూడాలని అన్నారు.
ముఖ్యంగా కొన్ని వారాల్లో మరో అద్భుతమైన కంటెంట్‌తో వస్తామని చెప్పుకొచ్చారు. దాంతో త్వరలో ఆదిపురుష్ నుంచి మరో విజువల్ వండర్ టీజర్ లేదా ట్రైలర్ లాంటి అప్టేట్స్ రాబోతోందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా ఆదిపురుష్ నెక్స్ట్ అప్డేట్.. డిజప్పాయింట్ చేసేలా ఉండదని గట్టిగా నమ్ముతున్నారు. పైగా నిర్మాత దిల్ రాజు.. జనవరి 12న, ఆదిపురుష్ వండర్స్ క్రియేట్ చేస్తుందని భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. దాంతో ఆదిపురుష్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.