నిర్మాత నాగవంశీ తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాడట. నెట్‌ఫ్లిక్స్‌తో జతకట్టి ఆయన ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో హీరో సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ కాంబోపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.