స్టార్ హీరోగానే కాకుండా, రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో వెనుకడుగు పడినా, 2024లో TDP- BJPతో కూటమిగా పోటీ చేసి 21 అసెంబ్లీ, 2 MP స్థానాలను గెలుచుకున్నారు. ఆయన పిఠాపురం MLAగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని AP Dy.CMగా సేవలందిస్తున్నారు.