మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్తో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘L2 ఎంపురాన్’. ఈ ఏడాది మార్చి 27న విడుదల కానుంది. అయితే రిలీజ్కు ముందే ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో అరుదైన రికార్డును నెలకొల్పింది. 6 దేశాలు, 25 పట్టణాల్లో షూటింగ్ జరుపుకున్న తొలి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.