అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్న ‘AA23’పై రైటర్ రత్నకుమార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, మే రెండో వారం నుంచి పనులు మరింత ఊపందుకుంటాయని అన్నాడు. ఇది అంతర్జాతీయ స్థాయిలో మెప్పించే గొప్ప కథ అని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపాడు. బన్నీతో చర్చలు తమ టీంలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయని చెప్పాడు.