టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్స్టాలో పెట్టిన స్టోరీ వైరల్ అవుతోంది. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుందని తెలిపింది. అయితే, మౌనంగా ఉండటం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుందని చెప్పుకొచ్చింది. ఫోన్ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా మూడు రోజులు ధ్యానంలో ఉంటానంటూ పోస్ట్ పెట్టింది.