నటి సాయి ధన్షికను తమిళ హీరో విశాల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన పెళ్లి వివరాలను విశాల్ పంచుకున్నారు. ‘నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యా. మరో 2 నెలల్లో అది పూర్తవుతుంది. మా పెళ్లి అందులోనే జరగనుంది. ఇప్పటికే ఇందులో ఆడిటోరియం బుక్ చేశాం. ఈ భవనం ప్రారంభోత్సవం జరిగిన వెంటనే పెళ్లి తేదీని నిర్ణయిస్తాం’ అని తెలిపారు.