మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ ప్రతిష్టాత్మక మూవీని 2026, జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 17 లేదా 18న సినిమా ట్రైలర్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్తోనే దేశవ్యాప్తంగా ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు టాక్.