నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతిపై AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘కనకరత్నమ్మ చనిపోయారని తెలిసి చింతిస్తున్నా. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కూతురు, మా వదినమ్మను తీర్చిదిద్దారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.