తిరువీర్, అజయ్ ఘోష్, రాశి, పాయల్ రాధాకృష్ణ నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. మే 7 నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ పోస్టర్ విడుదల చేసింది.