దీర్ఘాయుష్మాన్ భవ అంటూ పవన్‌కు చిరంజీవి విషెస్ చెప్పగా.. చిరుకు పవన్ థాంక్స్ చెప్పారు. ‘నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్యకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, మీ శుభాకాంక్షలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. సమాజానికి ఏదైనా చేయాలని మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు జనసేన ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది’ అని రాసుకొచ్చారు.