నటుడు రాజశేఖర్ తన వివాహ బంధం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మొదట శ్రీదేవి తనను పెళ్లి చేసుకోవాలని అడిగినా, కుల కట్టుబాట్ల వల్ల అది కుదరలేదని తెలిపాడు. ఆ సమయంలో జీవితతో ఈ విషయం చెప్పగా.. ‘నీ నిర్ణయం నీది, కానీ నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకుంటే నేను మాత్రం జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను’ అని ఆమె చెప్పిన మాటలు తనను కదిలించాయని ఆయన వెల్లడించాడు.