పింక్ సిటీ జైపూర్ వేదికగా ఐఫా అవార్డుల వేడుక ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలో నిన్న OTTలో మంచి ఆదరణ దక్కించుకున్న మూవీలు, సిరీస్‌లకు అవార్డులు ఇచ్చారు. ఉత్తమ చిత్రంగా అమర్ సింగ్ చంకీలా, ఉత్తమ సిరీస్‌గా పంచాయత్ సీజన్ 3లు అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే(సెక్టార్ 36), నటిగా కృతి సనన్ (దో పత్తి)గా నిలిచారు.