నటుడు విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ఇరుముగన్’ వంటి హిట్ తర్వాత దర్శకుడు ఆనంద్ శంకర్‌తో ఆయన మరోసారి చేతులు కలిపినట్లు తెలుస్తోంది. సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రం మునుపటి కంటే భిన్నంగా ఉండబోతుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విక్రమ్ అభిమానులు ఈ క్రేజీ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.