స్టార్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ కొత్త చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఆమెకు కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌కి అంగీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ చిత్రానికి ‘రమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.