చియాన్ విక్రమ్ హీరోగా ప్రేమ్ కుమార్ సీ. దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుంది. ‘చియాన్ 64’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా గోకులం స్టూడియోస్‌లో ఈ మూవీకి సంబంధించిన లుక్ షూట్ జరిగినట్లు సమాచారం. ఏప్రిల్ 17న విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అప్డేట్స్ రాబోతున్నట్లు టాక్.