TG: హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో షూటింగ్‌కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రొడక్షన్ యూనియన్‌కి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.