టాలీవుడ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా రిలీజై దాదాపు 9నెలలు పూర్తయినా.. ఇప్పటివరకు OTTలోకి రాలేదు. అయితే ఈ సినిమా OTTలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.