టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి కన్నుమూశారు. ఉదయ్‌పూర్ రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆయన తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించారు. ముఖ్యంగా తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా వంటి సూపర్ హిట్ మూవీలను తెరకెక్కించారు.