వివాదాస్పద హిందీ చిత్రం ‘ద తాజ్ స్టోరీ’ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం లయన్స్ గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక పరేష్ రావల్ ప్రధాన పాత్రలో తుషార్ అమ్రిష్ గోయల్ తెరకెక్కించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా.. తాజ్ మహల్ అసలు పేరు ‘తేజో మహాలయ’ అని, అది ఒకప్పుడు శివాలయం అనే కథాంశంతో సాగుతుంది.