రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముందుగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నిర్మాణ పనుల జాప్యం వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు జూన్ 24 రాత్రి నుంచే భారీగా ప్రీమియర్స్ పడే అవకాశం ఉందట.