‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్’ (UNFPA)కి లింగ సమానత్వ భారత గౌరవ రాయబారిగా నటి కృతి సనన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పరిశ్రమలో లింగ సమానత్వం గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉండే సౌకర్యాలు, గుర్తింపు హీరోయిన్లకు ఉండటం లేదని ఆమె తెలిపారు. లింగ సమానత్వం విషయంలో చిత్ర పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.