సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమైన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మే 1న విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. రెండు రోజుల్లో కేవలం రూ. 2.15 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించి ట్రేడ్ వర్గాలను నిరాశపరిచింది. వరల్డ్ వైడ్ రూ. 2.82 కోట్ల గ్రాస్‌కే పరిమితమై ఈ సినిమా ఫ్లాప్ దిశగా సాగుతోంది.