బాలీవుడ్ నటి హుమా ఖురేషి, నటుడు రచిత్ సింగ్తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్లో వీరి వివాహం ఘనంగా జరగబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ విషయమై ఇప్పటివరకు వీరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.