సీనియర్ నటి ఆమని ఆసక్తికర విషయాలను పంచుకుంది. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన పక్కన హీరోయిన్గా నటించాలన్నది తన డ్రీమ్ తెలిపింది. అయితే ‘స్టాలిన్’లో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించే అవకాశం వచ్చినా, తన డ్రీమ్ హీరోను అన్నయ్యగా చూడలేక ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఆయన సరసన నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.