నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కాగా, ఈ సినిమా కోసం అనిరుధ్ భారీ మొత్తంలో పారితోషకం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దాదాపు రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.