తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించిన ‘మామన్’ మూవీ జీ5లో తమిళ వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సదరు OTTలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మూవీలో అక్క, తమ్ముడు మధ్య ఉండే అనుబంధాన్ని దర్శకుడు ప్రశాంత్ పాండియరాజ్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో శ్వాసిక, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు.