దర్శకనటుడు తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘గాయపడ్డ సింహం’. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘బ్రైడ్ సాంగ్’ అనే తొలి పాట ఏప్రిల్ 1, 2026న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఇక దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.