దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన డ్రీం ప్రాజెక్ట్ ‘వేదవ్యాస్’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాతో దక్షిణ కొరియాకు చెందిన నటి జున్ హ్యూన్ జీ(Jun Hyeon Jee) తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె నటించడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. తెలుగు వారి సంస్కృతి-సంప్రదాయాలు తనకెంతో నచ్చాయని ఈ కొరియన్ బ్యూటీ ఇటీవల చెప్పింది.