బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి, ఆమె కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ధర్మేంద్ర అనే యువకుడి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.3 కోట్ల విల్లాకు అడ్వాన్స్, 5 కిలోల బంగారం తీసుకుని, చివరకు పెళ్లికి నో చెప్పడంతో మోసపోయామని బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.