అక్షయ్ కుమార్, టబుల ‘భూత్బంగ్లా’పై వస్తున్న రూమర్లపై దర్శకుడు ప్రియదర్శన్ తీవ్రంగా స్పందించాడు. అక్షయ్ జోక్యంతో టబు సీన్లు కట్ చేశారన్న వార్తలను ఆయన ఖండించాడు. ‘ఎడిటింగ్ నా బాధ్యత, అక్షయ్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. సినిమా చూశాకే నటీనటులు సంతృప్తి చెందారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసేవారు సిగ్గుపడాలి” అంటూ నెటిజన్ల విమర్శలపై ఆయన నిప్పులు చెరిగాడు.