తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సాధించిన విజయంపై సినీ తారలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘తొలి ఎన్నికల్లోనే ఇంతటి అద్భుతమైన ప్రభావాన్ని చూపిన విజయ్‌కి అభినందనలు. ఇది చారిత్మక విజయం. మీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ విక్రమ్, శివకార్తికేయన్, నిఖిల్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు పోస్టులు పెడుతున్నారు.