మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈనెల 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించగా.. హీరో విష్ణు కూడా తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖ నటులు అతిథి పాత్రల్లో నటించారు.