‘యానిమల్’ సినిమాలో విలన్గా నటించి బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీలో విలన్ పాత్రను అలా చూపించడంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ‘ప్రతి సినిమాలో హీరో, విలన్ మధ్య మాటల యుద్ధాలు చూస్తూనే ఉంటాం. అందుకే కాస్త విభిన్నంగా చూపించాలనే ఉద్దేశంతోనే ఆ పాత్రను అలా క్రియేట్ చేశా’ అని చెప్పారు.