తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీ నిర్మాణ సంస్థకు అభిమానులు ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు. సినిమా టైటిల్ కార్డుపై సీఎం విజయ్ అని వేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలను కంగుతినిపించి తమిళ రాజకీయ చరిత్రను విజయ్ తిరగరాశారు.