‘పుష్ప’ మూవీలో కేశవ పాత్రతో మెప్పించిన జగదీష్ ప్రతాప్ బండారి హీరోగా మారుతున్నాడు. హర్ష డైస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘మటన్’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అత్యంత వైలెంట్‌గా ఉండి సినిమాపై అంచనాలు పెంచుతోంది. ‘రక్తం.. శక్తి.. ప్రతీకారం.. వేట మొదలైంది’ అంటూ మేకర్స్ సినిమాపై హైప్‌ను పెంచారు.