వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ 40% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారట.